అసలీ స్ట్రీట్లిబ్ ఏంటి?

ఒకే లక్ష్యం, ఒకటే విధానం

మా Manifesto

మేం సాహిత్య సృజనను గౌరవిస్తాం, పుస్తకాలను ప్రేమిస్తాం, మీలాగానే. అయితే మీ సృజనాత్మకతకు రూపాలను పుస్తకాలుగా, e-బుక్సగా అంటే స్క్రీన్ మీద చూపిస్తాం. పుస్తక ప్రియులు ప్రపంచ వ్యాప్తంగా వున్నారు. ఆ చదివే కళ్ళకు చేరాలంటే e-బుక్సే సరైన  మార్గం. ఆ దారిని సాంకేతికంగా సుగమం చేయడం మా విధి.

సాంప్రదాయబద్దమైన ముద్రణలో జాగు, బరువు , శ్రమ ఏ మాత్రం లేకుండా e-బుక్స్ ని అందంగా సిద్ధం చేయడంలో నిపుణులు, రచయితలు, డిజైనర్లు, సాంకేతిక నూతనత్వాన్ని నెలకొల్పేవాళ్లు . అందరినీ సమన్వయం చేస్తూ, రచన విలువలను పెంపొందించడం, నలుగురికీ  సాహిత్యాన్ని   పంచడంలో మాది ప్రధాన పాత్ర.

గొప్ప పుస్తకాలను అందరికీ అన్నివేళలా అన్నిచోట్లా లభ్యం అయ్యేట్టు చేయాలన్నదే మా అభిలాష. రాసే చేయి, చదివే కన్ను, ఊహలకు రూపాన్నిచ్చే సాంకేతికత ఈ  మూడు కలిస్తేనే పుస్తక ప్రపంచ మేధ యినుమడిస్తుంది. అక్షరాలే  ప్రపంచ ఐక్యభావానికి ఆధారాలు. ఆలోచనా వైశాల్యాన్ని పెంచుతాయి. ఆ నమ్మకమే మా సాంకేతిక లక్ష్యానికి బలం. ఆచరణ!

Our Tribe